పవర్ స్టార్ తో పూరి భారీ ప్లాన్
ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ తో మళ్లీ లైంలైట్ లోకి వచ్చిన డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమా తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత పూరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ సినిమాకే ప్లాన్ వేసినట్టు సమాచారం. పింక్ సినిమా రీమేక్ తో పవన్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు తెలుస్తోంది.
దీంతో పవన్ కళ్యాణ్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేస్తునట్టు తెలుస్తోంది. ఈ మేరకు పవన్ కు పూరి ఓ కథ కూడా వినిపించినట్టు దానికి పవన్ కూడా ఓకే అన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.