అభిమాని బర్త్ డే చేసిన హీరో
మాములుగా హీరోల పుట్టిన రోజును అభిమానులు ఓ పండుగల సెలెబ్రేట్ చేసుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ జరిగింది వేరు. ఓ అభిమాని పుట్టినరోజును తన ఫేవరెట్ హీరో సెలెబ్రేట్ చేయడం విశేషం. ఆ హీరో మరెవరో కాదు. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి.
ప్రస్తుతం విజయ్ సేతుపతి యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తలపతి 64 సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు.ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్న విజయ్ సేతుపతి తన అభిమాని పుట్టిన రోజును సెలబ్రేట్ చేశాడు. షూటింగ్‌లో కేకు కట్ చేసి అభిమానికి కేకు తినిపించాడు. కాగా ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.