ఆ హాస్టల్ లో ముగ్గురు గర్భవతులయ్యారు
అది ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్. చక్కగా చదువుకోవాల్సిన ముగ్గురు అమ్మాయిలు గర్భం దాల్చారు. దానికి కారణం ఎవరో ఇంకా తెలియ రాలేదు. వివరాల్లోకి వెళితే...
కొమురం భీం జిల్లా, అసిఫాబాద్‌లో ట్రైబల్ మహిళా డిగ్రీ కళాశాలలో దారుణ ఘటన వెలుగుచూసింది. ట్రైబల్ హాస్టల్ ఉంటూ చదువుకుంటున్న ముగ్గురు విద్యార్థినులు గర్భం దాల్చడం కలకలం సృష్టిస్తోంది. పదిమంది విద్యార్థినులకు సక్రమంగా రుతుస్రావం రాకపోవడంతో అనుమానం వచ్చి హాస్టల్ సిబ్బంది వారిని రిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పదిమందిలో ముగ్గురు అమ్మాయిలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటీవ్ వచ్చిందని తెలిపారు. నెల రోజుల తర్వాత మరోసారి పరీక్షలు నిర్వహించి ఒకరే గర్భం దాల్చారని వెల్లడించారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరుపుతున్నారు. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.