జూన్ లో ప్రభాస్ పెళ్లి!
తెలుగు సినీ ఇండస్ట్రీ లో పెళ్ళికి సిద్డంగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లిపై ఎన్నో పుకార్లు వచ్చాయి. అనుష్కతో ఆయన పెళ్లి అని కొన్నాళ్ళు, వేరే అమ్మాయితో అని ఇలా రకరకాల గాసిప్స్ వచ్చాయి. అయితే వీటన్నిటికీ ప్రభాస్ పెద్దమ్మ పుల్ స్టాప్ పెట్టినట్టే కనబడుతోంది.
ప్రభాస్ పెళ్లి విషయంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పెద్దమ్మ. ప్రభాస్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలను చూసి నవ్వుకుంటున్నామని, జాన్ సినిమా తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అన్నారు.