ఎంఎస్ కే కు గుడ్ బై!
టీం ఇండియా సెలక్షన్ కమిటీ చీఫ్ ఎంఎస్‌కే ప్రసాద్‌కు ఉద్వాసన తప్పక పోవచ్చు. ఎంఎస్‌కే పదవీ కాలం వరల్డ్‌కప్‌తోనే ముగిసినప్పటికీ మరో ఆరు నెలలు పొడిగించారు. అయితే ఆయన ఉద్వాసనకు సమయం దగ్గర పడినట్టే కనబడుతోంది. తాజాగా హిందూస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. సెలక్షన్ కమిటీలో మార్పులు తప్పవనే సంకేతాలిచ్చాడు. కాకపోతే ప‍్రస్తుతం ఉన్న సెలక్షన్ కమిటీని మొత్తం ఒకేసారి మార్చాల్సిన అవసరం లేదన్నాడు. ప్రధానంగా ఇద్దరి సభ్యుల్ని మార్చితే సరిపోతుందన్నాడు. ఈ నియామకాన్ని కొత్త ఏర్పాటు చేయబోయే క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) చూసుకుంటుందన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్దగా క్రికెట్ ఆడిన అనుభవం లేని ఎంఎస్‌కేను ఎంతకాలం చీఫ్ సెలక్టర్‌గా కొనసాగిస్తారని వెటరన్ క్రికెటర్ల కూడా ప్రశ్నించారు. ఇక చీఫ్ సెలక్టర్‌గా ఎంఎస్‌కే గుడ్ బై చెప్పి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఇటీవల హర్భజన్ కూడా విన్నవించాడు.