Iam shocked on my first lip lock

లిప్ లాక్ చేసేటప్పుడు వణుకు వచ్చింది 



లిప్ లాక్ సన్నివేశాలు చూసే ప్రేక్షకులకు థ్రిల్, ఎంజాయ్ కలిగిస్తాయి. కానీ మాకు మాత్రం భయం, వణుకు పుట్టిస్తాయి అంటోంది పూజ హెగ్డే. పూజ నటించిన అల... వైకుంఠపురం సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.


అయితే తొలినాళ్లలో తన మొదటి లిప్ లాక్ సన్నివేశం గురించి ఇలా చెప్పుకొచ్చింది. మొహంజ‌దారోలో లిప్ లాక్ గురించి డైరెక్ట‌ర్ అశుతోష్ గోవారిక‌ర్ నాకు వివ‌రించారు. నేను కూడా ఆ సీన్‌లో న‌టించ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. అయితే మా చుట్టూ చాలా మంది జ‌నాలు నిల‌బ‌డి ఉండ‌టంతో నాకు క‌ష్టంగా అనిపించింది. నాకు వ‌ణుకు పుట్టింది. అందుకు కార‌ణం అంత‌కు ముందు నేను అలాంటి స‌న్నివేశంలో న‌టించ‌లేదు.