అదే నా జీవితంలో లోటు: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ 54వ పుట్టిన రోజునే ఆయనకో బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది సల్మాన్ సోదరి అర్పిత ఖాన్. అదే రోజు ఆయన సోదరి రెండో బిడ్డకు జన్మనిచ్చింది. అర్పితకు ఇది వరకే ఓ బాబు ఉన్న సంగతి తెలిసిందే. సల్మాన్ మరోసారి మామయ్య అయ్యాడు. ఈ సారి తన చెల్లెలు తనకు చిట్టి మేనకోడలును బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చిందని సంబరపడి పోయాడు.
తాను రెండు సార్లు మామయ్య అయ్యానని, కానీ ఒక్క సారి కూడా తండ్రిని కాలేకపోయానని, అదే తన జీవితంలో తీరని లోటని సరదాగా వ్యాఖ్యానించాడు.