వయస్సు 8 ఏళ్ళు.... సంపాదన 15 కోట్లు..
ఆ పిల్లాడి వయస్సు 8 ఏళ్ళు... కానీ ఆ పిల్లాడు ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించాడు. అవును ఇది నిజం. అతని సంపాదన తెలుస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అక్షరాలా 15 కోట్ల పైమాటే. 2019 సంవత్సరానికి గాను యూట్యూబ్ లో అత్యధిక పారితోషికం అందుకున్న అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అతని పేరు ర్యాన్ కాజీ.
అతనికి మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడే అతని తల్లిదండ్రులు ర్యాన్ కాజీ పేరు మీద 'ర్యాన్స్ టాయ్స్ రివ్యూ' పేరుతో ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించారు. మొదట్లో ఈ చానల్‌కు అంతగా ఆదరణ లేకపోయినప్పటికీ ర్యాన్ కాజీ పోస్ట్ చేసే వీడియోల వల్ల తరువాత పుంజుకుంది. తాజాగా 'ర్యాన్స్ వరల్డ్'గా పేరు మార్చిన ఈ చానల్‌లో కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఆట వస్తువుల ప్రత్యేకతల గురించి వాటితో ఆడుకుంటూ ర్యాన్ వివరిస్తాడు. ఈ ఛానల్ ఎంత పాపులర్ అంటే ఇప్పటికే ఈ ఛానెల్ కు 30 మిలియన్ మంది subscribers ఉన్నారు.